యాత్ర సమయములో పాటించవలసిన నియమ నిష్ఠలు

  •    తీర్థయాత్ర అన్నది విహార యాత్ర కాదు అందువలన కొద్దిపాటి తపస్య చేయుటకు సంసిద్ధంగా ఉండవలెను.
  •   భక్తులు యాత్ర సమయములో మాంసాహారము భుజించకుండుట, ధూమపానము, మధ్యపానము సేవించకుండుట మొదలగు నియమములు ఖచ్చితముగా పాటించవలెను.
  •   యాత్ర సమయములో తప్పని సరిగా కనీసం ఎనిమిది మాలలు జపించవలెను.
  •   భక్తులు నిర్వాహకుల సూచనలను శ్రద్ధతో విని పాటించవలెను.
  •   భక్తులు సమయపాలనను పాటించవలెను. ఒక్కరి కారణంగా మొత్తం యాత్రికులు అందరూ ఇబ్బంది పాలు అవకుండా జాగ్రత్త పడవలెను.
  •   సమయ పాలనను పాటించినచో, ఎక్కువ స్థలాలను దర్శించుకొనవచ్చు, లేని పక్షమున కొన్ని ప్రదేశములను మాత్రమే దర్శించుకొనడం జరుగుతుంది.
  •   భక్తులు ఎక్కడికైన వెళ్ళదలచినచో నిర్వాహకులకు తెలియపరచి వెళ్ళవలెను.
  •   ఇతర భక్తులకు సహాయము చేయుటను ముఖ్య ఆచరణగా పెట్టుకొనవలెను.
  •   మనము భగవంతున్ని దర్శించుకొని అతని కరుణా కటాక్షములను పొందుటకు వచ్చామన్న విషయమును మనస్సులో పెట్టుకొని, అనవసరపు మాటలు, తగాదాలు, నింద ప్రతి నిందలు చేసుకోకుండా నియంత్రించుకొనవలెను.
  •   దర్శనమునకు వెళ్ళునప్పుడు, మిగతా అవసరమయిన చోట్ల వరుస క్రమమును పాటించవలెను.
  •   వరిష్ట భక్తులకు, మహిళలకు ప్రాధన్యత ఇవ్వవలెను.
  •   తల్లిదండ్రులు తమ పిల్లలపై ద్యాస ఉంచవలెను. ప్రవచనముల సమయములో పిల్లలను నియంత్రణలో ఉంచగలరని ఆశిస్తున్నాము.
  •   నిర్వాకులకు తెలియకుండా అపరిచయులను యాత్రకు ఆహ్వానించవద్దు.
  •   “భక్తుల సేవయే నా సేవ” అన్నాడు కృష్ణుడు. అందుచేత యాత్ర సమయములో ఇతర భక్తులకు సేవ చేసి భగవత్ కృపను పొందుటకు సిద్ధంగా ఉండండి.
  •   యాత్ర సక్రమముగా జరుగుటకు నిర్వాహకులు అన్ని విధాలుగా మీ సహకారాన్ని ఆశిస్తున్నారు.


I Agree